14 April, 2026 | 1:39 PM

ఘనంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర

29-12-2025 01:50 AM

పటాన్చెరు, డిసెంబర్ 28 :తెల్లాపూర్ డివిజన్ లో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెల్లాపూర్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహోత్సవ జాతర కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ జాతరలో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, కురుమ సంఘం నాయకులు కంజర్ల మల్లేశ్, మాజీ కౌన్సిలర్లు కంజర్ల శ్రీశైలం, బాబ్జీ, మాజీ వార్డు సభ్యులు సాగర్, మాజీ టెలికాం బోర్డు సభ్యులు దయాకర్, కురుమ సంఘం సభ్యులు పాండు, బుక్షపతి, హర్ష, మోహన్ తదితరులు పాల్గొన్నారు.