calender_icon.png 8 January, 2026 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధారంలో స్వచ్ఛభారత్ చైతన్యం

03-01-2026 12:00:00 AM

గోపాలపేట, జనవరి 2: పచ్చదనం పరిశుభ్రత ప్లేట్ అండ్ గ్రీన్ స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలను యువకులు మేము సైతం అంటూ కాలనీలను శుభ్రపరుస్తున్న బుద్ధారం యువకులు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ డాక్టర్ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలను చేపట్టారు. మందు మద్యం డబ్బుకు బానిస కావద్దని సర్పంచ్ డాక్టర్ శేఖర్ గౌడ్ యువకులకు చైతన్య పరిచారు దీంతో శుక్రవారం తెల్లవారుజామునే  గ్రామంలోని పలు కాలనీలలో మురుగు కాలువలు ముళ్లపదలు సిసి రోడ్ల శుభ్రత వంటి పనులను చేపట్టారు.

గతంలో సర్పంచ్ గ్రామంలో ఏ పని చేయించాలన్న ఎన్ని డబ్బులు ఇస్తావని ఎంత కూలిస్తావు అంటూ పనులు చేయించేవారు. కొన్ని పనులకు సర్పంచ్ లే సొంత డబ్బులు ఖర్చు చేసేవారు. కానీ దీనికి విరుద్ధంగా నూతనంగా ఎన్నికైన డాక్టర్ శేఖర్ గౌడ్ వీటన్నిటికీ బానిస కావద్దని మన ఊరును మనమే బాగుపడ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని గ్రామాన్ని శుభ్రం చేసుకుందామని హితో పలికారు.

గ్రామంలో కొంతమంది యువకులు ఓ కమిటీగా వేసుకొని వీటన్నిటికీ బానిస కావద్దని ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చే విధంగా కష్టపడి గ్రామాన్ని శుభ్రం చేయించడంలో సర్పంచ్ డాక్టర్ శేఖర్ గౌడ్ కే దక్కింది. యువకుల్లో ప్రజల్లో ఇంత మార్పు తీసుకురావడం అభినందనీయమని పలువురు నూతన సర్పంచును అభినందించారు. సర్పంచ్ డాక్టర్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు రోజు చేపడతామని గ్రామాన్ని అభివృద్ధి చేయడం నా ధ్యేయమని అన్నారు.  కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు యువకులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.