03-01-2026 12:00:00 AM
చేగుంట, జనవరి 2 : చేగుంట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గా నూతనంగా గెలిచిన చేగుంట పట్టణ గ్రామ ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫిని ఎన్నుకోవడం జరిగింది. మండల పరిధిలోని కాంగ్రెస్, బిజెపి, బిఅర్‌ఎస్ తరపున గెలిచిన ఉప సర్పంచుల కూడికను ఏర్పాటు చేసి వారి సహకారంతో రఫిని ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు మండల ఉపాధ్యక్షులుగా సత్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చౌదరి శ్రీనివాస్, కోశాధికారి సిద్దిరాములు ఎన్నికయ్యారు.
ఈ సమావేశంలో చేగుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్, చందాయిపెట్ ఉపసర్పంచ్ పబ్బ నగేష్ గుప్తా, కిష్టపూర్ ఉపసర్పంచ్ రవీందర్ రెడ్డి, పోలిమామిడి ఉపసర్పంచ్ మద్దూరి రాజు, చిన్న శివనూర్ ఉపసర్పంచ్ బోల ప్రశాంత్,అన్నంతసాగర్ ఉపసర్పంచ్ మొగులయ్యా, కన్యారం ఉపసర్పంచ్ గడ్డం జ్యోతి,, రెడ్డిపల్లి ఉపసర్పంచ్ ఉప్పు స్వామి,సోమ్లా తండా ఉపసర్పంచ్ సునీత, శ్రీనివాస్ రెడ్డి, సండ్రుగు సతీష్ పాల్గొన్నారు.