03-01-2026 12:00:00 AM
మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్ టౌన్, జనవరి 2: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధియే లక్ష్యంగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గ తమ ఆత్మీయ కానుకగా వీరన్న పేట, కుమ్మరి వాడి, బోయపల్లి, అప్పన్నపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేకి విద్యపై ఉన్న ప్రత్యేక దృష్టి, చిత్తశుద్ధి వల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఎమ్మెల్యే తన స్వంత నిధులతో ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఎమ్మెల్యే పెట్టుకున్న నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే నిరంతర కృషి ఫలితంగా నియోజకవర్గంలో ఐఐఐటి కళాశాల, లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించబడినట్లు గుర్తు చేశారు.
ఈ విద్యాసంస్థలు మన ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం చూపుతున్నాయని పేర్కొన్నారు. మన నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఐఐఐటి వంటి ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో సీట్లు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి, తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శాంతన్న యాదవ్, జాజి మెగ్గ నర్సింహులు, మోతిలాల్, శరత్, నాయకులు లీడర్ రఘు, డీలర్ రఘు, అబ్దుల్ హక్, రామాంజనేయులు, దేవేందర్ నాయక్, గుమాల్ శ్రీనివాసులు, పాలమూరు శ్రీనివాసులు, సామె కుర్మయ్య, కమాల్ సత్యనారాయణ, సామె రామకృష్ణ, సామె గోవింద్, ఈటె ఆంజనేయులు,మెరుగు బచ్చన్న, మెరుగు రవి, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.