calender_icon.png 2 August, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేతే లక్ష్యం

02-08-2025 12:28:39 AM

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి

మోతే,ఆగష్టు 1: అరకులందరికీ రేషన్ కార్డులు అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డుల మంజూరు పత్రాలను శుక్రవారం ఆమె అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత  పాలకులు పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు.

ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన మాట మేరకు రేషన్ కార్డులు ఇవ్వడమే గాక రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ప్రజాపాలనలో ప్రతి గడపకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించి ఆర్థికంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఆర్డిఓ వేణుమాధవ్, తాసిల్దార్ వెంకన్న, ఎంపీడీవో ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి పి పుల్లారావు, మాజి ఎంపీపీ ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు సామ చిన్న వెంకట్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.