calender_icon.png 22 December, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం

22-12-2025 11:05:08 AM

హైదరాబాద్: తెలంగాణలో నేడు కొత్త సర్పంచులు(sarpanches), ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల(ward members) ప్రమాణస్వీకారం చేయనున్నారు. సర్పంచుల ప్రమాణస్వీకారానికి పంచాయతీ కార్యదర్శులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈనెల 11,14,17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు(Telangana Gram Panchayat Elections) ముగిశాయి. 12,702 మంది కొత్త సర్పంచులు, 1,11,803 మంది వార్డు సభ్యులు ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో సర్పంచుల ప్రమాణస్వీకారం జరుగుతోంది. ప్రమాణం తర్వాత ప్రత్యేకాధికారులు సర్పంచులకు బాధ్యతలు అప్పగించనున్నారు.