అంతంపల్లి పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం అంతంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. నూతన చైర్మన్‌గా చిట్టెడి సుధాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రైతులకు పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సేవలు సకాలంలో అందించడంలో పీఏసీఎస్‌లు కీలకపాత్ర పోషించాలని సూచించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






