11-05-2025 12:00:00 AM
టైమ్ మిషన్‌లో వెనక్కి!
చెన్నైలోని ‘ది ఓల్డ్ క్యూరియాసిటీ షాప్’లోకి అడుగు పెట్టగానే.. ఒకప్పటి ఫస్ట్‌లైన్ బీచ్ వీధి, మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్, మౌంట్ రోడ్, మెరీనా బీచ్.. ఒకప్పటి ఛాయా చిత్రాలు స్వాగతం పలుకుతాయి. ఇక షాపులో పూర్తిగా పురాతన, అరుదైన పాత వస్తువులే దర్శనమిస్తాయి. నిజానికి టైమ్ మిషన్ అనేది ఒక కల్పితం. టైమ్ మిషన్ ఉంటే గతానికి వెళ్లడం ఎవరికైనా సరదానే కదా!
స్నేక్ గేమ్ గుర్తుందా?
నోకియా ఫోన్.. ఇప్పటి స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న అత్యాధునిక ఫీచర్లు ఏవీ అందులో ఉండేవి కాదు. అయినా నోకియా ఫోన్‌లోని ‘స్నేక్ గేమ్’ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న స్క్రీన్‌పై ఆ గేమ్ ఆడుతూ ఉంటే సమయం కూడా తెలిసేది కాదు. ఓ పాము గోళీలను మింగుతూ సైజ్ పెరుగుతూ ఉంటే.. మనలో ఉత్సాహం ఉప్పొంగేది. ఏదేమైనా నోకియా ఫోన్ మన బాల్యపు మధుర స్మృతులకు ఒక గొప్ప చిహ్నం. ఆ జ్ఞాపకాలు మన మనస్సులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.