11-05-2025 12:00:00 AM
ఈరోజుల్లో పొడవాటి జుట్టు ఎవరికి ఉంది చెప్పండి. ఫ్యాషన్, ట్రెండ్ అంటూ అమ్మాయిలు కూడా హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. దీంతో వాలు జడ జాడే ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఈ ఊర్లో అమ్మాయిలు మాత్రం పొడవాటి, ఒత్తున జుట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. చైనాలోని గుయ్‌లిన్ నగరానికి కొద్దిదూరంలో హుయాంగ్లుయో అనే గ్రామం ఉంది. ఇక్కడ వయస్సుతో సంబంధం లేకుండా మహిళలందరూ వాలు కురులతో హొయలు పోతున్నారు.
రెడ్ యావో తెగకు చెందిన ఈ మహిళలు వారి కురుల పెరుగుదలకు ఓ ప్రత్యేక రకమైన బియ్యంతో చేసిన షాంపూను వాడుతున్నారు. దాన్ని వారే తయారుచేసుకోవడం మరో విశేషం. అలాగే వారు తమ జుట్టుని నది నీటితోనే కడుగుతారట. ఇలా ఆ మహిళలు తమ వాలు కురులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కారు.