calender_icon.png 23 August, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

11-05-2025 12:00:00 AM

రవీంద్ర భారతి ప్రారంభోత్సవం

1961 మే 11న రవీంద్ర భారతి భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ సాంస్కృతిక కళా భవనంగా దీన్ని ప్రారంభించారు.  1960 మార్చి 23న అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నర్, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల రెడ్డి రవీంద్ర భారతి ఆడిటోరియంకు పునాది రాయి వేశారు. ఈ భవనాన్ని లండన్‌లోని ఆర్కిటెక్చరల్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్వ విద్యార్థి మహ్మద్ ఫయాజుద్దీన్ రూపొందించారు. రవీంద్రనాథ్ జన్మదిన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మించిన ఈ ఆడిటోరియంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంవత్సరానికి పైగా దీన్ని నిర్మించింది. 

జాతీయ సాంకేతిక దినోత్సవం

నేడు జాతీయ సాంకేతిక దినోత్సవం. 25 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘ఆపరేషన్ శక్తి’ పేరిట భారత్ నిర్వహించిన అణు పరీక్షలు ప్రపంచాన్ని నివ్వెరపరచాయి. అవి విజయవంతం కావడంతో అణు శక్తి సంపన్న దేశాల జాబితాలో ఇండియా స్థానం సంపాదించుకున్నది. అదే స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో 1998 మే 11ను ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ గా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రకటించారు. విద్య, వైద్యం, రవాణా, సమాచార మార్పిడి, అంతరిక్ష పరిజ్ఞానం, ఎలెక్ట్రానిక్స్ విభాగాల్లో సాంకేతిక మార్పులు ప్రపంచం రూపురేఖల్ని శరవేగంగా మార్చివేస్తున్నాయి. 

మదర్స్ డే

మదర్స్ డే అనేది యునైటెడ్ స్టేట్స్ లో మే నెలలో రెండవ ఆదివారం జరుపుకునే వార్షిక సెలవుదినం. మదర్స్ డే సాధారణంగా తల్లులు, మాతృత్వంతో సమాజానికి చేసిన సేవలను, సహకారాన్ని గుర్తిస్తుంది. ఈరోజు జరుపుకోవ డానికి పునాది వేసింది అన్నా జార్విన్. ఈరోజు అమ్మలకు ఇష్టమైనవి గిఫ్ట్స్‌గా ఇవ్వడం.. కేక్ కట్ చేసి వేడుకగా జరుపుకోవడం వంటివి చేస్తారు. 

నేషనల్ ఫోమ్ రోలింగ్ డే

నేషనల్ ఫోమ్ రోలింగ్ డే ప్రతి సంవత్సరం మే 11న జరుపుకుంటారు. ఇది కండరాల నొప్పులు తగ్గించడానికి ఫోమ్ రోలర్‌ని ఉపయోగించి స్వయంగా మసాజ్ చేసుకుంటారు. ఫోమ్ రోలింగ్ కండరాలలోని నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. 

ఆపరేషన్ వల్చర్..

చైనా యుద్ధంలో ఫ్రెంచ్ దళాలను రక్షించడానికి 1954లో అమె రికా ప్రతిపాదించిన ఒక ఆపరేషన్ పేరు ఆపరేషన్ వల్చర్.  ఆపరేషన్ వల్చర్ అనేది అమెరికా ప్రతిపాదించిన ఒక రహస్య ప్రణాళిక. దీన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ ఫోస్టర్ డల్లెస్ ప్రకటించారు. ఆయన ప్రకటనతో అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ముగిసింది.