బాధితులకు సత్వర న్యాయం
చేకూర్చడమే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యం
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, ఆగస్టు 20 (విజయ క్రాంతి): జిల్లాలో నేర రహిత సమాజ స్థాపనకు, బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడమే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. గురువారం జిల్లా క్రైమ్ రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరస్థులకు న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చేసినప్పుడే సమాజంలో నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు.
విచారణ అధికారుల పకడ్బందీ దర్యాప్తు, కోర్టు డ్యూటీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల చొరవ వల్లే ఈ 17 కేసుల్లో కీలక శిక్షలు సాధ్యమయ్యాయన్నారు. ఇదే నిబద్ధతతో పనిచేస్తూ రానున్న రోజుల్లోనూ నేరస్థులకు చట్టపరంగా గుణపాఠం చెబుతామన్నారు.
జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలిచి నేరస్థులకు శిక్షలు ఖరారు చేయించిన అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






