6 May, 2026 | 5:53 AM

మద్యం తాగి నిమజ్జనానికి వచ్చేవారిపై చర్యలు తీసుకోండి

12-09-2024 12:00 AM

సిటీ పోలీసు కమిషనర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మద్యం తాగి గణేశ్ నిమజ్జనానికి వచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ లేఖ రాశారు. గతేడాది నిమజ్జన సమయంలో చాలా మంది మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయన్నారు. నిమజ్జన సమయం లో అసభ్యకరం గా ప్రవర్తిస్తే వారిపైన చర్య లు తీసుకోవాలని హైదరా బాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను కోరారు. భక్తిభావంతో జరిగే నిమజ్జన కార్యక్రమానికి  తాగి రావడం సరికాదన్నారు.