19-05-2025 05:18:13 PM
కామారెడ్డి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జోష్ణ..
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్ లో డైలీ యువర్ ఆర్టీసీ ఆఫీసర్(Daily Your RTC Officer) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జోష్ణ(RTC Regional Manager Joshna) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రయాణికులు డయల్ యువర్ ఆర్టీసీకి ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. ఈనెల 20న సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు సమస్యలను ఫోన్ ద్వారా ప్రయాణికులు చెప్పవచ్చని తెలిపారు.
ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సెల్ నెంబర్ 99592 26011, కామారెడ్డి డిపో మేనేజర్ సెల్ నెంబర్ 99592 6018, నిజామాబాద్ డిపో మేనేజర్-1, 99 592260106, నిజామాబాద్ డిపో -2,9959226017, ఆర్మూర్ డిపో మేనేజర్ 9959226019, బోధన్ బస్ డిపో మేనేజర్ సెల్ నెంబర్, 9959226001, బాన్సువాడ బస్ డిపో మేనేజర్, 9959226020 లకు ఫోన్ చేసి ప్రయాణికులు తమ సమస్యలను తెలుపాలని కోరారు. ఆర్టీసీ సిబ్బంది వల్ల ఎదురవుతున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కారం జరుగుతాయని రీజినల్ మేనేజర్ జోష్ణ విజయక్రాంతి ప్రతినిధితో తెలిపారు.