calender_icon.png 15 November, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

15-11-2025 01:04:45 AM

గంభీరావుపేట, నవంబర్ 14(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభరావుపేట మండలంగర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. గంభీరావుపేటలో రూ. 14 లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. అంగన్వాడిల్లో చదివే విద్యార్థులకు కుట్టించిన యూనిఫాంలను, పోషకాహారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతి చిన్నారికి సమీప అంగన్వాడీ కేంద్రాల్లో చదవాలని, కేంద్రాల్లో అందించే కోడి గుడ్లు, బాలామృతం, అన్నం ఇతర పోషకాహారాన్ని వారికి తినిపించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఆటల్లో, చదువులో రాణిస్తారని వివరించారు.పిల్లలు బడి బయట ఉండవద్దని, రోజూ అంగన్వాడీ కేంద్రాలకు రావాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని, తినాలని, ఆదుకోవాలని సూచించారు.

పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి, అంగన్వాడిలో మూడు నెలలపాటు పోషకాహారం ఇవ్వాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు మునగ ఆకు, నువ్వులు, ఇతర కూరగాయలు, కోడి గుడ్లు, పాలు ఆహారంలో భాగం చేసుకుంటే మందులు అవసరం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో మహిళలు పోషకాహారం తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా బాగుంటుందని తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన గంభీరావుపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ధాన్యం నిల్వలు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం రైస్ మిల్లులకు తరలించారో అధికారులతో ఆరా తీశారు.కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.