15-11-2025 01:03:08 AM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు
సుల్తానాబాద్ నవంబర్ 14 ( విజయ క్రాంతి):ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని.. రైతులు ఆయిల్ ఫామ్ పంటపై ఆసక్తి చూపాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస అధ్యక్షతన ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, అంతకుముందు సహకార వారోత్సవాల్లో భాగంగా స్థానిక కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించారు. సుల్తానాబాద్ సింగిల్ విండో ఉమ్మడి జిల్లాల్లోనే ఎంతో అభివృద్ధి సాధించటం అభినందనీయమని చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సీఈవో బూరుగు సంతోష్ , పాలకవర్గం , సిబ్బందిని ఎమ్మెల్యే విజయ రమణారావు అభినందించారు..
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా ఉద్యానవన అధికారి జగన్ మోహన్ రెడ్డి, ఆయిల్ ఫామ్ సీవో కేశ కళ్యాణ్, కె వి కే శాస్త్రవేత్త వెంకన్న ,సీఈఓ బూర్గు సంతోష్ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు .