calender_icon.png 15 May, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను పట్టించుకోండి మహాప్రభో..!

15-05-2025 02:01:23 AM

అశ్వాపురం మే 14(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి బుధవారం  సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతు న్నా ప్రభుత్వానికి రైతు గోస పట్టదా అని ప్రశ్నించారు.

అశ్వాపురం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నెల్లిపాక పరిధిలో ధాన్యం మొత్తం ఆరు సెంటర్లలో 20వేల బ స్తాలు రైతులు తమ సొంత ఖర్చులతో కాటాలు పెట్టి, లాట్లు వేసుకుని లారీల కోసం కళ్ళు కాయ లు కాసేలా ఎదురుచూస్తున్నారు.  ధాన్యం కాటాలు పెట్టినవి కాకుండా ఇంకా ఈ ఆరు సెంటర్లలో 20వేల ధాన్యం బస్తాలు కాటా పెట్టవలసి ఉన్నాయి.

ఇందులో ఎక్కువ ధాన్యం ఆనం దపురం సెంటర్లలో కాటా పెట్టవలసి ఉన్నది. ధాన్యం సెంటర్లు ప్రారంభించిన నాటి నుండి గన్ని సంచులు మొదలుకొని దాన్యం కాటా పెట్టుట, లారీల ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని విభాగాలలో ప్రభు త్వ అధికారులు విఫలమై రైతులను పట్టించుకునే నాధుడే లేడనీ ఆరోపించారు.

ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు  రైతులని పట్టించుకోవలని, అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర నిద్ర వీడి యుద్ధ ప్రాతిపదికన రైతుల ధాన్యాన్ని తరలించాలని, అలాగే గన్ని బ్యాగులు తెప్పించి మిగతా ధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో  రైతులు పూజల రవి, కొల్లు ఉప్పల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.