calender_icon.png 15 May, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఠాణాలో సొమ్మసిల్లి వ్యక్తి మృతి

15-05-2025 01:59:41 AM

  1. పోలీసులు కొట్టారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ 

అంతకుముందే  గొడవపడ్డారని పోలీసుల వెల్లడి 

తాము కొట్టలేదని స్పష్టీకరణ 

రాజేంద్రనగర్, మే 14: కుటుంబ కలహా ల నేపథ్యంలో దంపతులు గొడవ పడి తమ బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చా రు. అనంతరం ఇరు వర్గాల వారు అంగీకార పత్రం రాసుకొని బయటకు వచ్చారు. అంతలోనే యువకుడు సొమ్మసిల్లి కింద పడి పో యాడు. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి త రలించగా మృతి చెందాడు. పోలీసులు కొట్టడంతోనే అతడు మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపించారు.

ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, మృతుడి కు టుంబీకుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ (35) అక్కడ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అ నంతరం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ పరిధి దర్గా ఖలీజ్ ఖాన్  ప్రాంతానికి వచ్చి ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు.

అత డు ఇక్కడ మరో యువతిని వివాహం చేసుకొని కాపురం పెట్టాడు. దంపతులకు పిల్లలు ఉన్నారు. అయితే ఇర్ఫాన్ మరో యువతిని వివాహం చేసుకునేందుకు యత్నించాడు. ఈ విషయంలో అతడి భార్య గొడవ పడిం ది. తనను ఇర్ఫాన్ వేధిస్తున్నాడని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధ వారం ఉదయం ఇర్ఫాన్ తో పాటు అతడి భార్య తరపు వారు తమ ఇంటి వద్ద గొడవపడ్డారు.

ఇంటి యజమాని సూచనతో రా జేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఇర్ఫాన్ కు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకొని  అంగీకార పత్రం రాసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఇ ర్ఫాన్ సొమ్మసిల్లి ఠాణా ఆవరణలోనే కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

- పోలీసులు కొట్టారని ఆరోపణ..

 ఇదిలా ఉండగా ఇర్ఫాన్ ను పోలీసులు కొట్టడంతోనే తీవ్రంగా గాయపడి మృతి చెం దారని అతడి సోదరుడు కుటుంబీకులు ఆ రోపించారు. ఈ విషయమై రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోను వివరణ కోరగా..  ఇరు వర్గాల వారు తమ ఇంటి వద్ద గొడవపడ్డారని, పోలీస్ స్టేషన్కు వచ్చారని..

అనారోగ్యం ఇతర సమస్యల కారణంగా ఇర్ఫాన్ కిందపడిపోవడంతో మృతి చెందాడని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. పోలీసులు అతడిని కొట్టార ని ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.