calender_icon.png 15 May, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ అభివృద్ధి..ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం

15-05-2025 02:04:13 AM

  1. ముందస్తు ప్రణాళికతో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నాం
  2. అభివృద్ధి పనుల్లో అవినీతి చోటుచేసుకుంటే ఉపేక్షించం
  3. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని
  4. రూ: 2 కోట్ల 65 లక్షల విలువచేసే అభివృధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ, మే 14 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంనియోజవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కొత్తగూ డెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని మంచి కంటి నగర్, పాలకోయ తండా, నవభారత్, జగ్గు తండా, గోవర్ధనగిరి కాలనీ, కొమ్ముగూడెం గొల్లగూడెం, సీతారామపట్నం, ప్రి యదర్శిని కాలనీలో రూ: 2 .65 కోట్ల  నిధులతో సీసీ రోడ్డు లు, సీసీ డ్రైన్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ముందస్తు ప్రణా ళికతో నియోజవర్గని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామాన్నారు.  బస్తీలు గ్రా మాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్షకు తావివ్వక నియోజకవర్గంలో ప్రతి బస్తీలో, గ్రామంలో రోడ్లు, డ్రైన్ లు నిర్మించి తీరుతానని ప్రజలకు హామీ ఇచ్చారు.

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని,  పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. .

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ k సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొ త్వాల శ్రీనివాసరావు, సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, డీ సుధాకర్, సీపీఐ, కాంగ్రెస్, సిపిఎం నాయకులు  తదితరులు పాల్గొన్నారు.