27-07-2025 12:00:00 AM
నిన్ననే హాస్టల్‌కు వెళ్లి చూసొచ్చా, మంచిగ చదువుకో బిడ్డా అని చెప్పా. హాస్టల్ రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా పడివున్న కొడుకును చూసి కన్నీరు మున్నీరయ్యే ఓ తల్లి మాటలివి. చదుకొనే పిల్లలు లేలేత ప్రాయంలోనే ఎందుకు ప్రాణాలు తీసుకొంటున్నారు. వి ద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలేమిటి? వాటిని నివారించేందుకు ఏం చేయాలి? మన విద్యా విధానం అసలు ఆత్మనే కోల్పోయింది. ఒకర్ని చూ సి ఒకరు మార్కుల కోసం పరుగు పందెం.. నిరంతరం విద్యార్థులపై కొనసాగుతున్న మానసిక ఒత్తిడి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలవుతు న్నాయి.
వ్యవస్థాగత వైఫల్యమే ఇందుకు కారణమని సుప్రీం కకోర్టు ఆవేదనతో చెప్పిన మాటలు అందరూ చెవికెక్కించుకోవాల్సిన అవసర ముం ది. స్కూళ్లు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లకు అనుబంధంగా వుండే వసతి గృహాలు.. ఎక్కడయితేనేం విద్యార్థుల పాలిట మృత్యు కుహరాలు అవుతున్నాయి. 2022 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా దాదా పు లక్షా 80 వేల మంది ఆత్మహత్య చేసుకుంటే, అందులో 13 వేల మంది విద్యార్థులే వున్నారు. వారిలో పరీక్షల్లో ఫెయిలై ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు.
దేశంలో ప్రతి ఏటా ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో దాదా పు 8 శాతం విద్యార్థులే వుండటం ఆందోళనకరమైన అంశం. ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నదే కాని తగ్గడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో వుంచుకుని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎదురవుతున్న మానసిక సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించింది. కోటా, జైపూర్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకునేందుకు వచ్చిన దేశంలోని అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
మా నసికంగా వారు ఎదుర్కొనే ఒత్తిడి అంతా ఇంతా కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32, 141 ఇస్తున్న అధికారాలతో సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ విషయంలో శుక్రవారం మార్గదర్శకాలతో ఒక రూలింగ్ ఇచ్చింది. విశాఖపట్నంలోని ఒక కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో మెడికల్ ప్రవేశ పరీక్షకు శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల పిల్లవాడు 2023 జూలైలో ఆత్మహ త్య చేసుకొన్న కేసును సీబీఐకి అప్పగించాలని ఆ పిల్లవాడి తండ్రి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంతకముందు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఆ కేసును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన సందర్భంగా, విద్యాలయాలు విద్యార్థులకు శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న సమస్యలపై ధర్మాసనం మార్గనిర్దేశకాలను ఇచ్చింది. విద్యార్థుల మానసిక స్థితిని ఎప్పటి కప్పుడు పరిశీలించేందుకు, వంద మంది కంటే తక్కువ విద్యార్థులు వున్న విద్యాసంస్థలో తప్పనిసరిగా ఒక అర్హత కలిగిన మానసిక నిపుణుడు ఉం డాలని పేర్కొంది. ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ, ఎల్‌జీబీటీక్యూ+ విద్యార్థుల పట్ల సున్నితంగా వ్యవహరించేందుకు తగిన శిక్షణా తరగతులు నిర్వ హించాలని.. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో, ఆత్మహత్యకు ప్రేరేపించే సీలిం గ్ ఫ్యాన్లు, బాల్కనీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.