31-07-2025 01:22:29 AM
ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి
మల్కాజిగిరి, జూలై 30 : ప్రభుత్వ భూములు కబ్జాకు గురవకుండా కాపాడాలని, ప్రజాప్రయోజనాల కోసం భూములను వినియోగించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని కలసి వినతిపత్రం అందజేశారు.
అంతాయిపల్లిలోని కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, యూపీహెచ్సీలు, మల్టీపర్పస్ హాల్లు, స్మశానవాటికలు, బ్రాహ్మణ కమ్యూనిటీ భవనం ఏర్పాటుకు స్థలాల కేటాయింపుపై చర్చిం చారు.
అలాగే సర్వే నంబర్లు 844, 278, 171, 582, 583లోని ప్రభుత్వ స్థలాలను కబ్జా నుంచి రక్షించాలని, వోక్స్ బోర్డ్ భూముల్లో రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీ కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కాలనీ, బస్తీ వాసులు, కుల సంఘాల నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.