13-01-2026 02:01:40 AM
700 కోట్ల గ్రొర్కెల స్కాంలో ప్రధాన నిందితుడు?
సీఎం గురించి మాట్లాడే అర్హత లేదు
ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, జనవరి 12(విజయక్రాంతి): సనత్‌నగర్ ,సికిందరాబాద్ నియో జకవర్గాలకు పట్టిన శని, చీడ, పీడ మాజీ మంత్రి తలసాని యాదవ్ అని, ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని తెలంగాణ ఫిషరీష్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తలసాని చేసిన వ్యాఖ్యలు ద య్యాలు వేదాలు వ ల్లించినట్లుగా ఉన్నా యన్నారు. సోమవా రం సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ గతంలో మం త్రిగా పని చేసిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ సికిందరాబాద్, సన త్ నగర్ నియోజకవర్గాలకు చేసిందేమీ లేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నీతులు మా ట్లాడి ఇప్పుడు బూతులు మాట్లాడుతన్నారని ధ్వజమెత్తారు. రూ.700 కోట్ల గొర్రెల స్కాం లో ప్రధాన నిందితుడిగా ఉన్న మీరు ముం దుగా గొల్ల, కురుమలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.