4 September, 2026 | 10:44 PM

Breaking News

ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •  

తెలంగాణ తల్లి ఎక్కడా?

10-12-2024 | 02:06am

* కరీంనగర్‌లో మూడేళ్లయినా విగ్రహం ఆచూకీ కరువు

కరీంనగర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువైన కరీంనగర్ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం మూడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. ఉద్య మ సమయంలోనే కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2011లో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం పక్కనే చొక్కారావు విగ్రహం కూ డా ఉండేది. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా 2021లో ఆ రెండు విగ్రహాలను తొలగించి గదుల్లో భద్రపరిచి జంక్షన్ పనులను చేపట్టారు.

2023లో కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి చొక్కారావు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేయలేదు. 

అయితే ఈ విగ్రహం ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియడం లేదు. దీనిపై మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా ఎవ రు పట్టించుకోలేదు. ఈ విగ్రహాన్ని అప్పటి ఏపీ కాంట్రాక్టర్ కనబడకుం డా చేశాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే నూత న విగ్రహాన్నైనా ఏర్పాటు చేయాలని నాటి ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు డిమాం డ్ చేస్తున్నారు