23 March, 2026 | 4:32 PM

చాంపియన్‌గా తన్వీ

26-08-2024 12:30 AM

చెంగ్డు: ఆదివారం చైనాలోని చెంగ్డులో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా అండర్ 17 & 15 పోటీల ఫైనల్లో భారత్‌కు చెందిన తన్వీ పత్రి విజయం సాధించి.. బంగారు పతకం కైవసం చేసుకుంది. 13 సంవత్సరాల తన్వీ వియత్నాంకు చెందిన రెండో సీడ్ గెయెన్ మీద 22 21 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. తన్వీ కేవలం 34 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి పసిడిని ముద్దాడింది. భారత్ నుంచి గతంలో సామియా ఇమాద్ ఫరూఖీ (2017), తస్నిమ్ మిర్ (2019) ఆసియా అండర్ టైటిల్స్ గెలిచారు.

ఈ టైటిల్ గెలిచిన మూడో ఇండియన్‌గా తన్వీ రికార్డులకెక్కింది. ఈ టోర్నమెంట్ మొత్తం మీద ఆడిన ఐదు మ్యాచుల్లో పత్రి ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం. ఫైనల్ మ్యాచ్‌లో పత్రి 11 తేడాతో ఒకానొక దశలో వెనుకబడినప్పటికీ ప్రత్యర్థి వరుస తప్పిదాలు చేసి గేమ్‌ను సమర్పించుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. జ్ఞానదత్తు కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పత్రి స్వర్ణం కైవసం చేసుకోవడం విశేషం.