15 April, 2026 | 2:15 AM

తపస్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

22-12-2025 12:00 AM

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 21: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికయింది. జిల్లా నూతన అధ్యక్షుడిగా చిలుముల మురళీధర్, ప్రధాన కార్యదర్శిగా వంగ నర్సిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా దేశ్ భాస్కర్, హరిపురం రఘు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చిలుముల మురళీధర్ మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తపస్ నిస్వార్థ సేవలందిస్తోందన్నారు. ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు. సిద్దిపేట పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు మండలాల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.