22-12-2025 12:00:00 AM
ముత్తారం కాంగ్రెస్ పార్టీ
మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
ముత్తారం డిసెంబర్ 21 (విజయక్రాంతి): మండలంలోని సీతంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పర్వతాలు ను పార్టీ నుండి సస్పెన్షన్ చేసినట్లు ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర టీపీసిసి జనరల్ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీను బాబుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పని చేసిన సీతంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కూరకుల పర్వతాలు, గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త అన్నం రాయమల్లు లను కాంగ్రెస్ పార్టీ నుండి, పదవీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందిని, వారితోఇప్పటి నుండి పార్టీ కి మరియు పార్టీ లో జరిగే కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేదని తెలుపారు. ఇక నుండి వారితో కపార్టీ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వారితో తిరిగితే వారిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చెయ్యడం జరుగుతుందని హెచ్చరించారు.