6 July, 2026 | 1:09 PM

Breaking News

సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •  

విత్తన షాపుల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు

30-05-2025 05:08 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని విత్తనాలు ఎరువుల షాపుల్లో శుక్రవారం టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రయానికి సిద్ధంగా ఉన్న విత్తనాలను, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులను, ఇన్వాయిస్, లైసెన్సులు, గోదాములను తనిఖీ చేశారు. విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, ప్రభుత్వం అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, స్టాకు బోర్డు రైతులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని దంతాలపల్లి మండలం లో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తనిఖీలు నిర్వహించారు. కేసముద్రం మండలంలో మండల వ్యవసాయ అధికారి వెంకన్న, ఎస్సై మురళీధర్ రాజ్, పి ఎస్ ఐ రవి కిరణ్ తనిఖీల్లో పాల్గొన్నారు.