17 April, 2026 | 11:23 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అక్రమంగా మట్టి తవ్వకాలు.. చట్టపరమైన నేరం

28-06-2025 06:11 PM

వేములవాడ పట్టణ, జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు

పది టిప్పర్లు, రెండు  హీటచి జేసిబి లు,ఒక కారు స్వాధీనం

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... వేములవాడ పట్టణ పరిధిలోని కోడిముంజ గ్రామ శివారులో  గల రామప్ప ఆలయం నుండి నిబంధనలకు విరుద్ధంగా మట్టి త్రవ్వి తరలిస్తున్నరన్న సమాచారం మేరకు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్  ఆధ్వర్యంలో పోలీసులు సంయుక్తంగా దాడులు చేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడగా పది టిప్పర్లు, రెండు  హిటచి జేసిబిలు,ఒక కారు స్వాధీనం చేసుకొని స్టేషన్ కి తరలించి విచారణ అనంతరం ముగ్గురు వ్యక్తులు అయిన 1. ఉత్తమ్ కరుణాకర్, 2. భువనగిరి మహేష్, 3. లంబ ప్రశాంత్ లపై కేసు నమోదు చేయడం జరిగింది.

నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి త్రవ్వకలు జరిగిన, రవాణా చేసిన కేసులు తప్పవని, జిల్లాలో ఎక్కడైనా మట్టిని తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయాలంటే ముందస్తుగా సంబంధించిన శాఖ నుండి అనుమతి పొందాలని,లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జిల్లా పరిధిలో ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలించినా,తవ్వకాలు చేసినా,నిల్వ చేసినా సమాచారం అందించాలని తెలిపారు.