18 April, 2026 | 12:57 AM

అల్ఫోర్స్‌లో గోరింటాకు సంబురాలు

28-06-2025 06:05 PM

కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోనిఅల్ఫోర్స్ బాలికల ఇ-టెక్నో పాఠశాలలో శనివారం ఆషాడమాస గోరింటాకు సంబురాలు ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థ అధినేత డా.వి నరేందర్ రెడ్డి హాజరై గోరింటాకు ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు ఒకరి చేతులకు ఒకరు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.