31 August, 2026 | 1:31 AM

టాటూ అండ్ పియర్సింగ్ స్టూడియో ప్రారంభం

31-08-2026 12:00 AM

రిబ్బన్ కట్‌చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

రామగిరి, ఆగస్టు 30 (విజయ క్రాంతి) రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొల్లపల్లి రాజమల్లు కుమారుడు గొల్లపల్లి నరేష్ నూతనంగా ఏర్పాటు చేసిన గదా టాటూ అండ్ పియర్సింగ్ స్టూడియోను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదివారం ప్రారంభించారు.రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించిన అనంతరం నిర్వాహకుడు గొల్లపల్లి నరేష్కు మంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ స్టూడియో దినదినాభివృద్ధి చెందాలని, వ్యాపార రంగంలో యువత మంచి గుర్తింపు సాధించి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.మంత్రి వెంట మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎల్లే రామ్మూర్తి, స్థానిక సర్పంచ్ కొండవేణ దివ్య సుధాకర్, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు తీగల సదయ్య, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.