31 August, 2026 | 2:38 AM

మన్‌కీ బాత్ ప్రసంగం వీక్షించిన కేంద్ర మంత్రి బండి

31-08-2026 12:00 AM

కరీంనగర్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 137వ రేడియో కార్యక్రమం ’మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆదివారం కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ నివాసంలో వీక్షించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయ ర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సా యిని మల్లేశం, మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.