27-01-2026 05:50:53 PM
- బెల్లంపల్లి టీబీజీకేఎస్ ఆఫీస్ వద్ద వేడుకలు
- జెండావిష్కరించి, కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టిఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ 23వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి టీబీజీకేఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జెండావిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ సాధించిన విజయాలను వక్తలు ఏకరువుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో సింగరేణి కార్మికుల త్యాగాలు మరువలేని అన్నారు. తెలంగాణ ఆకాంక్షను నిజం చేసిన కెసిఆర్ కార్మికులకు ఒక సంఘం అంటూ ఉండాలని సింగరేణిలో టీబీజీకేఎస్ ఏర్పాటు చేశారన్నారు.
చరిత్రలో, కోలిండియాలో లేని హక్కులను సింగరేణి కార్మికులకు టీబీజీకేఎస్ సాధించిందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల్లో టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఒక పాశుపశాస్త్రంగా మారిందన్నారు. సింగరేణిలో జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ను సాధించిన ఘనత ఒక్క టీబీజీకేఎస్ కే ఉందని వెల్లడించారు. కారుణ్య ఉద్యోగాలతో పాటు ఇలా మరెన్నో చరిత్రాత్మకమైన హక్కులు, సదుపాయాలను సాధించిన సంఘాన్ని ఇప్పటికీ కార్మికులు మర్చిపోరన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రతినిధులు దాసరి శ్రీనివాస్, ఈ సుందర్ రావు, వెంకటరమణ, బడికల రమేష్, సంపత్, రమేష్, నరసయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.