calender_icon.png 27 January, 2026 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మల్లేష్ ఎంపిక

27-01-2026 06:58:07 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో  నిర్వహించిన 35వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ అండర్14 బాలుర ఖో-ఖో పోటీలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, సుల్తానాబాద్‌ కు చెందిన విద్యార్థి ఎం మల్లేష్ అద్భుత ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికయ్యాడు. ఈ ఎంపికతో అతడు తెలంగాణ రాష్ట్ర ఖో-ఖో జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. కృష్ణమాచార్య, వైస్ ప్రిన్సిపల్ కే. కోటి,పి. రాజ్‌కుమార్,ఫిజికల్ డైరెక్టర్  పీడీ.డి. ప్రసాద్, పీఈటీ సురేందర్లు వెల్లడించారు.

జాతీయస్థాయి ఖో-ఖో పోటీలు ఈ నెల 27, 28, 29, 30 తేదీలలో హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరగనున్నట్లు తెలిపారు. ఈ ఘనత సాధించిన విద్యార్థిని  పెద్దపల్లి జిల్లా పీఈటీ అధ్యక్షులు వి. సురేందర్ కార్యదర్శి డీ. రమేష్, సుల్తానాబాద్ పీఈటీ కార్యదర్శి ప్రణయ్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, అంతర్జాతీయ ఖో-ఖో క్రీడాకారుడు గెల్లు మధుకర్ యాదవ్, పెద్దపల్లి జిల్లా ఖో-ఖో సంఘం కార్యదర్శి వేల్పుల కుమార్, అధ్యక్షుడు లక్ష్మణ్, కోశాధికారి ఈ.నరేషూతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం  అభినందించారు. విద్యార్థి జాతీయస్థాయిలో సత్తా చాటుకుని రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.