27-01-2026 06:54:14 PM
షాద్ నగర్ ను అభివృద్ధి చేస్తాం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
షాద్‌నగర్,(విజయక్రాంతి): పట్టణ అభివృద్ధిలో గత పాలకుల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. మౌలిక వసతుల కొరత, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్ల దుస్థితి వంటి సమస్యలపై ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.
మంగళవారం మున్సిపల్ ఎన్నికల సన్నద్ధం కోసం షాద్ నగర్ పట్టణం ఎ బి కాంప్లెక్స్ లో బీజేపీ పట్టణ అధ్యక్షులు హరి భూషణ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గత పదేళ్ళ పాలన లో షాద్ నగర్ అభివృద్ధికి బీఆర్ఎస్ నిధులు గుండు సున్నా అని, షాద్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రజలకు మంజూరు చెయ్యలేదని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి వస్తే పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, శుభ్రమైన పాలన, పారదర్శకతతో కూడిన పరిపాలన అందించడం సాధ్యమవుతుందని అన్నారు.యువత, మహిళలు, పేదల సంక్షేమమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని, మున్సిపల్ స్థాయిలో కూడా అదే విధంగా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యం బీజేపీ ముందుకు పోవాలని అన్నారు.
బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అందె బాబయ్య మట్లాడుతు మున్సిపల్ పరిపాలనలో పారదర్శకత లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. ప్రజలపై పన్నుల భారం పెరిగినా, తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. షాద్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పుకు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో దేపల్లి అశోక్ గౌడ్, నర్సింహా గౌడ్, వంశీ కృష్ణ, మల్చలం మురళి, ఎంకనోళ్ల వెంకటేష్, మఠం ఋషికేష్, మహిళా మోర్చా నాయకురాలు ప్రవీణ, శ్రీనివాస్ చారి,గజ్జల ప్రవీణ్, పసులోటి శ్రవణ్, కంచుకోట మణికంఠ, కాసజు శివ, శ్యామ్ సుందర్, వెంకటేష్, అందేల సందీప్, క్యామ మహేష్, రమేష్, అంజనేయులు, నక్కల మల్లేష్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.