27-01-2026 07:09:43 PM
మెదక్,(విజయక్రాంతి): జాతీయ ఉపాధి హామీ చట్టం పథకం నుంచి మహాత్మా గాంధీ గారి పేరు తోలగించడాన్ని ఖండిస్తూ బుధవారం ఉదయం 10:00 గంటలకు మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కొర్విపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ముఖముఖిగా మాట్లాడడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు.
20 సంవత్సరాల క్రితం, పార్లమెంట్‌లో సమ్మతితో MGNREGA చట్టాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆమోదించరని గుర్తుచేశారు. అది ఎంతో విప్లవాత్మకమైన అడుగు అని, దాని ప్రయోజనాలు కోట్లాది గ్రామీణ కుటుంబాలకు చేరాయిని ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురైన వారు, అత్యంత పేద ప్రజలకు ఇది జీవనాధారంగా మారిందాని అన్నారు. MGNREGA పథకాన్ని కాపాడుతూ, కార్మికుల హక్కులు, ఉపాధి భద్రత కోసం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న
ఈ పోరాటానికి ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కరారు. ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర, జిల్లా నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి ఎంపీటీసీలు, బ్లాక్ మండల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు కార్మికులు కర్షకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.