calender_icon.png 27 January, 2026 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మక్క సారలమ్మ జాతరకు సెలవు ప్రకటించాలి

27-01-2026 07:02:04 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి చెందిన సమ్మక్క సారలమ్మ జాతరకు సెలవు ప్రకటించాలని పిఆర్టీయూ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జడల  సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ దేశ నలుమూలల నుండి  జాతరకు విచ్చేస్తున్నందున, ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు, రెండు రోజులు సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని  కోరారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడంతో, స్థానిక సెలవులను ప్రకటించి, సెలవులు తీసుకోవడం విడ్డురంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించకపోవడం శోచనీయమని, ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, సమ్మక్క సారలమ్మ జాతరకు, రెండు రోజులు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించాలని ఆయన  కోరారు.