calender_icon.png 27 January, 2026 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ సేవలకు ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

27-01-2026 07:16:29 PM

జైనూర్,(విజయక్రాంతి): ఉపాధిహామీపథకాన్ని సమర్థంగా అమలుచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించినందుకు మండలంలోని మాణిగూడ గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మెస్రం మనోహర్‌కు ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మంగళవారం జైనూర్ ఉపాధిహామీ కార్యాలయంలో ఈజీఎస్ ఏపీవోతో పాటు ఉద్యోగులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వకారణమని ఈజీఎస్ ఏపీవో నగేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్లు దుర్గం రాజలింగు, అంబాజీ, ఆత్మరాం, లింగేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు ఆత్రం రాజు,ప్రధాన కార్యదర్శి ఆత్రం రవీందర్, సంఘ నాయకులు జాదవ్ పండిత్‌రావు, అంబాజీ, బాబు, దత్తు తదితరులు పాల్గొన్నారు.