27-01-2026 05:47:19 PM
దేవరకొండ,(విజయ క్రాంతి): మంగళవారం దేవరకొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిధులుగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పున్న కైలాష్ నేత హాజరై మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించాలన్నారు మరియు ఓట్ చోరీ, జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును మార్చే విధంగా బిజెపి మోడీ సర్కార్ చేస్తున్న కుట్రను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజక వర్గ అధ్యక్షులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జర్పుల లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కొర్ర గౌతమి, జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడ సైదులు, మూడవత్ సాగర్, నేనావత్ మోతిలాల్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు రహీమ్, రమేష్ నాయక్, రాకేష్, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు సోషల్ మీడియా కన్వీనర్ భువన్ తదితరులు పాల్గొన్నారు.