నిజాలను దాచేందుకు అధికార దుర్వినియోగం
మంత్రి వివేక్‌పై టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి ఆగ్రహం
వివేక్ హయాంలోనే హెచ్‌సీఎలో భారీ దోపిడీ : గురువారెడ్డి
టీజీ20 లీగ్ అనుమతి పత్రం చూపించరెందుకు?
హైదరాబాద్, జూన్ 21 : తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి గురు వారెడ్డితీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్లోని తాజ్ ట్రైస్టార్ హోటల్లో టీసీఏ ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని అధికార యంత్రాంగం ఒత్తిళ్లతో అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
హోటల్ యాజమాన్యాన్ని బెదిరించి సమావేశానికి అనుమతి నిరాకరింపజేశారని, అయితే నిజాన్ని ఆపలేకపోయారని పేర్కొన్నారు. దీంతో హోటల్ బయట రోడ్డుపైనే మీడియా సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజాస్వా మ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివే యడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం సిగ్గుచేటని, శనివారం మంత్రి వివేక్ హడావుడిగా నిర్వహించిన ప్రెస్ మీట్ కూడా వారి భయాన్ని బహిర్గతం చేసిందని గురువారెడ్డి వ్యాఖ్యానించారు.
అసలు టీసీఏ ఎక్కడుందని వివేక్ ప్రశ్నించడం ఆయన అ వగాహనా లేమికి నిదర్శనమన్నారు. 2021 లోనే టీసీఏతో కలిసి పనిచేయాలని బీసీసీ స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. గత 15 ఏళ్లలో హెచ్‌సీఏలో రూ.600 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగాయని, దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 2004 నుంచి 2026 వరకూ హెచ్‌సీఏపై వివేక్ కుటుంబ ప్రభావమే ఎక్కువగా ఉందన్నారు. విళాఖ సంస్థకు హెచ్‌సీఏ నిధుల నుంచి రూ.69 కోట్లు అక్రమంగా మళ్లించే ప్రయత్నంపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేశారు. అలాగే టీజీ20 లీగ్‌పై గురువారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ లీగ్‌కు బీసీసీఐ అనుమతి ఉంటే దానికి సంబంధించి పత్రాలను ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. అ నుమతి లేని ఈ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లు, నిర్వాహకులు, ఇతర అధికారులపై నిషేధం విధించే అవకాశముందని హెచ్చరించారు. టీజీ20 లీగ్‌లో ఒక్క జిల్లాస్థాయి క్రికెటర్‌కూ సరైన ప్రాతినిథ్యం లేకపోవడం దీని అసలు స్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. హె చ్‌సీఏ సస్పెండెడ్ సభ్యుడు శేష్ నారాయణ్ కోసం ప్రత్యేకంగా స్పోక్స్ పర్సన్ అనే లేని పదవిని సృష్టించారని విమర్శించారు. తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే తెలంగాణ క్రి కెటర్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.






