20-08-2025 12:50:45 AM
నారాయణపేట. ఆగస్టు 19 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో దామరగిద్ద గురుకుల పాఠశాలలో ఎం చరణ్ పదవ తరగతి చదువుకొనే విద్యార్థిపై దాడి చేసి కొట్టిన వైనం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే రా జోలి మండలం చిన్న ధన్వాడ గ్రామానికి చెందిన దళిత విద్యార్థి కి దామరగిద్ద మండల బీసీ రెసిడెన్షియల్ పాఠశాల (సింగారం క్రాస్) పదో తరగతి చదువుతుండగా పాఠశాలకు చెందిన యాదగిరి రెడ్డి అనే సోషల్ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థి పై దాడి చేయగా చేతి మణికట్టు విరిగినట్లు తండ్రి జయన్న ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయంపై తండ్రి ప్రిన్సిపల్ శ్రీనివాసులు ను సంప్రదించగా సార్ లీవ్ లో ఉన్నాడని ఇకనుండి ఏమి జరుగకుండా చూస్తానని తెలిపినట్లు విద్యార్తి నాన్న జయన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా బీద విద్యార్తి పై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై అలాగే ప్రిన్సిపల్ శ్రీనివాసులు పై చర్యలు తీసుకోవాలని తండ్రిజయన్నకోరారు.