11-02-2025 10:51:24 PM
ఘనంగా జిల్లా స్థాయి ట్రైబల్ కల్చరల్ మీట్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి ట్రైబల్ కల్చరల్ మీట్ 2024-25 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి విద్యార్ధులు ప్రదర్శించిన ఛాయ చిత్ర కళ ప్రదర్శనను తిలకించారు. సబ్ కలెక్టర్ యువరాజ్ తో కలసి ఏ.ఎం.ఎస్ అప్ ను ప్రారంభించారు. అదేవిధంగా కలెక్టర్ నెమలి పింఛన్ టోపీని ధరించి ఆదివాసీలతో కలిసి గుస్సాడీ నృత్యాలు చేస్తూ అందరిలో ఉత్సవాన్ని నింపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. భారత దేశంలో వివిధ జాతులు, వివిధ సంస్కృతులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ తమ సంస్కృతిలో ఉన్న గొప్పదనాన్ని చాటి చెప్పుకునే అవకాశం రాజ్యాంగం మనకు కల్పించిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సంస్కృతి సమ్మేళనం, భిన్న సంస్కృతులు ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. పిల్లలందరూ గుస్సాడి, థింసా, తీజ్ నృత్యాలను ఎంతో కన్నుల పండుగగా ప్రదర్శించారని, ఈ సంప్రదాయాలు ఎప్పటికి ఇలాగే ఉండేలా చూడాలని ఆన్నారు.