05-09-2025 12:00:00 AM
దేశంలో 14.71 లక్షల పాఠశాలలు ఉన్నాయి. అందులో కోటికి పైగా ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 14 శాతం ఉన్న అక్షరాస్యత.. నేడు 70 శాతానికి పెరిగింది. స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యా యుల సంఖ్య పెరిగింది.. కానీ విద్యా ప్రమాణాలవాసి మాత్రం అనుకున్నంత పెరగలేదు. నేటి ఆధునిక ప్రపంచంలో పోటీతత్వం పెరిగిన వేళ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
జాతి సమగ్రాభివృద్ధి సమాజాన్ని, సమున్నత విలువలు గల వ్యక్తులను తయారు చేసే శక్తి సామర్థ్యాలు గురువులకు మాత్రమే ఉంటాయి. పిల్లల సమగ్ర వికాసంలో తల్లి దండ్రుల తర్వాత గురువే అత్యంత ప్రభావశీలమైన పాత్రను పోషిస్తారు. విజ్ఞాన శక్తి, విజ్ఞాన వికాసం, సంపూర్ణ వ్యక్తిత్వం వైపు సమాజాన్ని నిరంతరం నడిపించగల శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉంటుంది.
మనిషిని మహనీయునిగా తీర్చిదిద్దే శక్తి, పిల్లలకు తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా గురువులు ఆదర్శప్రాయులు కాగలరు. గురువు లు తమ శిష్యులకు బాల్యంలోనే నైతిక, మానవీయ విలువలు, సమాజంలో బంధాలు ప్రాముఖ్యతను నేర్పించగలరు. పిల్లల్లో విచక్షణ జ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి పరిశీలన, పరిశోధన, పరికల్పన ప్రక్రియల్లో కావల్సిన శిక్షణ ఇవ్వాలి.
ఉపాధ్యాయులు.. పిల్లల్లో తార్కిక ఆలోచనలు పెంచడంతో పాటు సృజనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి పరచడం ముఖ్యం. పాజిటివ్ దృక్పథంతో పా టు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించ డం ద్వారా ప్రజాస్వామిక జీవితంలో భావి పౌరులుగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే. ఇలాంటి ప్రగతిశీల ఉపాధ్యా యులు సమాజానికి తక్షణ అవసరం.
పెరగని విద్యా ప్రమాణాలు
దేశంలో 14.71 లక్షల పాఠశాలలు ఉన్నాయి. అందులో కోటికి పైగా ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 14 శాతం ఉన్న అక్షరాస్యత.. నేడు 70 శాతానికి పెరిగింది. స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యా యుల సంఖ్య పెరిగింది..
కానీ విద్యా ప్ర మాణాలవాసి మాత్రం అనుకున్నంత పెరగలేదు. నేటి ఆధునిక ప్రపంచంలో పోటీత త్వం పెరిగిన వేళ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పోటీ పరీక్షలు నెగ్గుకు వచ్చే విధంగా విద్యార్థులను తయారు చేయడంలోనూ విద్యారం గం విఫలమవుతోంది. విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాల అభివృద్ధి, నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టే మెళుకువలకు సంబంధించిన అవగాహన సామర్థ్యం పూర్తిగా లోపించింది.
విద్యార్థుల్లో అధునాతన స్కిల్స్ నేర్పే ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది. ప్రభుత్వాల ఉదాసీనత నిర్లక్ష్యం కారణంగా విద్యారంగంలో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ కొరవడింది. దీని వల్ల పిల్లల మానసిక స్థితిని గుర్తించి బో ధించే టీచర్లు కరువైపోయారు. ఈ పరిస్థితి వల్ల చాలా మంది పిల్లలు మధ్యలోనే బడి మానేసి బాల కార్మికులుగా మారుతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
బలమైన పునాది ఉంటేనే
భవనానికి బలమైన పునాదులు ఎంత అవసరమో.. దేశం అభివృద్ధి చెందడానికి సుశిక్షిత మానవ వనరులు అంతే అవసరం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిప థంలో పురోగమించాలంటే సుశిక్షితులైన ఉపాధ్యాయుల సంఖ్య పెరగాలి. ఇందుకు దక్షిణ కొరియాను ఉదాహరణగా పేర్కొనవచ్చు. అక్కడ అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను బోధనా రంగం వైపు ఆకర్షిస్తున్నారు.
అధిక జీతభత్యాలు, ఇతర సౌకర్యా లు కల్పించడం వల్ల విదార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి పరిచి మానవ వనరుల వికాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జపాన్, సింగపూర్ లాంటి దేశాలు విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నాయి. అందుకే ఆ దేశాలు ఆర్థికంగానూ బలంగా కనిపిస్తున్నాయి. జపాన్, సింగపూర్‌లలో అవలంబిస్తున్న విద్యాభివృద్ధి వ్యూహాలు, ప్రణాళికలు..
మన దేశంలోనూ అమలయ్యేలా చూడా లి. దేశంలో అనేక బీఈడీ కళాశాల్లో అక్రమాలు చోటు చేసుకుంటుండటంతో బోధ నా సౌకర్యాలు కొరవడ్డాయి. అవస్థాపన సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. విద్యాధికారుల పర్యవేక్షణ వ్యవస్థ నీరుగారిపోయిం ది. కార్పొరేట్ విద్య పేదలకు దూరమైంది. ప్రైవేటు స్కూళ్లలో నైపుణ్యాలు లేని ఉపాధ్యాయులు పనిచేయడం వల్ల విద్యా ప్ర మాణాలు ఆశించిన మేర పెరగడం లేదు.
ఐదో తరగతి చదువుతున్న పిల్లలు ఇప్పటికీ రెండో తరగతి పాఠ్యాంశాలే సరిగ్గా చదువలేకపోతున్నారు. గణితంలో చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ వెనకబడి ఉండటం మన విద్యా ప్రమాణాలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి.
తక్షణ చర్యలు అవసరం
ఇప్పటి విద్యా వ్యవస్థలో మార్పు తేవడానికి ప్రభుత్వం తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. అవి ఏంటంటే.. పాఠశాలల్లో చిన్నారుల అభ్యసన ప్రక్రియను మెరుగుపరచాలి. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందంటూ విద్యార్థులను ప్రోత్సహించాలి. బూజు పట్టిన పాత విద్యా విధానాలను విడనాడాలి. పిల్లల్లో అధ్యయన, అభ్యాసన ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం ప్రపంచం ఏఐగా మారిపోతున్న తరుణంలో టీచర్లకు నవీన సాంకేతికతలో శిక్షణ అందించాలి.
డిజిటల్ విద్యలో శిక్షణను ఇవ్వాలి. జాతీయ విద్యా విధానం సూచించినట్లు జీడీపీలో ఆరు శాతం నిధులు విద్యా రంగానికి కేటాయించాలి. విద్యార్థుల్లో సామాజిక స్పృహ ను పెంచటానికి చరిత్ర, సామాజిక శాస్త్రా ల అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే మనస్త త్వం ఉన్న వ్యక్తులను టీచర్లుగా నియమించకూడదు.. వారిని బోధనా రంగంలోకి రాకుండా నిషేధించాలి.
విద్యార్థులకు ఉచి త ఆరోగ్య, వైద్య పరీక్షలు నిర్వహించేందు కు ప్రతి పాఠశాలల్లో కౌన్సెలింగ్ కేంద్రా లు నెలకొల్పాల్సిన అవసరముంది. విద్యారంగంలో పాలన సంస్కరణలు చేపట్టాలి. ప్రతిభావంతులైన యువతను విద్యారంగం వైపు ఆకర్షించే చర్యలు చేపట్టాలి. ఉపాధ్యాయులకు సకాలంలో జీతభత్యాలు, పదోన్నతులు కల్పించాలి.
మానవ వనరుల వికాసంలో క్రియాశీల పాత్ర పో షిస్తున్న ఉపాధ్యాయ లోకంలో నూతన వెలుగులు తేవడానికి ప్రభుత్వం సమగ్ర విద్యా సంస్కరణలు చేపట్టాలి. ఉపాధ్యా య దినోత్సవం స్ఫూర్తిగా.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించాలి. జాతిని తీర్చిదిద్దే గురువులను.. వారి సేవలను గుర్తించే సంకల్పానికి నాంది పలకాలి.
వ్యాసకర్త సెల్: 9440245771