calender_icon.png 11 September, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్యాన్ని చూపడం గురువు బాధ్యత

05-09-2025 12:00:00 AM

భారతీయ సంస్కృతిలో గురువుకి ఇచ్చే ప్రాధాన్యత ఏమిట నేది జగమెరిగిన సత్యం. తల్లిదండ్రుల తర్వాత తమ జీవితంలో గురువుని దేవుడిగా పూజిస్తారు. అందువల్లనే భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనదిగా నిలిచింది. గురువు లేని విద్య గుడ్డి విద్యగా భారతీయ ప్రజల్లోనూ సామె త నానుడిగా ఉంది. అది ఏ రంగమైనా గురువు లేకుండా విద్యను అభ్యసించడం సాధ్యం కాని పని అన్న విషయం అంతర్గతమే.

అందుచేత సమాజంలో అద్భుతమై న మార్పులకు పునాది రాళ్లుగా ఉండే గురువు స్థానానికి చాలా ప్రాధాన్యత ఉం ది. అది ప్రాచీన భారతీయ సంస్కృతి నుం చి నేటి ఆధునిక సమాజం వరకు నిరంతర ప్రక్రియలా కొనసాగుతూ వస్తున్నది. నేటి సమాజంలో శిష్యులు, గురువుల ముందు సందర్భాన్ని బట్టి గౌరవం, భక్తి శ్రద్ధలు చూపించకపోయినా..

విద్య నేర్పిన గురువుల పైన, ఉపాధ్యాయ వృత్తి పైన చులక న భావనతో ఉండటమనేది, సమాజంలో గురు శిష్యుల మధ్య ఒకనాటి మానవ నైతి క సంబంధాలు క్షీణిస్తున్నాయి అని చెప్పడానికి నిదర్శనం. అందుకే గురువులు తమ శిష్యులకు సమాజంలో పొరలు కమ్మిన అసత్యాన్ని పారద్రోలి సత్య మార్గాన్ని చూపించడం గురుతర బాధ్యతగా భావించాల్సిన అవసరముంది.

బోధనలే ప్రాధాన్యం..

ఒక వ్యక్తి తాను ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి తల్లిదండ్రుల తర్వాత గురువు చెప్పే బోధనలే అత్యంత ప్రాధాన్యమైనవి. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, విప్లవాత్మక మార్పులు తీసుకురావడా నికి ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే బోధనల పైనే ఆధారపడి ఉంటుంది.

గురు శిష్యుల సామాజిక బంధనాల్లో భాగంగా ఆధునిక భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబరు 5న జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరి సెప్టెంబర్ 5నే భారత జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం సర్వేపల్లి రాధాకృష్ణన్. దేశానికి రెండు సార్లు ఉప రాష్ర్టపతిగా, ఒకసారి రాష్ర్టపతిగా పనిచేయడానికి ముం దు ఆయన గురువుగా చేసిన సేవలు భారతీయ విద్యావ్యవస్థలో అజరామ రం.

ఈ నేపథ్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటు న్నాం. ఒకానొక సందర్భంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అనవసర పొగడ్తలతో, అవార్డులతో తనని సత్కరించడం కంటే.. తన జన్మదిన ఉత్సవాన్ని ఉపాధ్యాయ వృత్తికి గౌరవ స్థానం దక్కేలా.. ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని కోరడమే ఈ దినో త్సవం జరపడానికి మరో ప్రధాన కారణం. 

ఆయన జీవితమే పాఠంగా

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో 1888 సెప్టెం బరు 5న జన్మించారు. ఓ సాధారణ బ్రా హ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. కటిక పేదరికాన్ని అనుభవించిన సర్వేపల్లికి కనీసం చదువుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు కొనుక్కోగలిగిన స్థోమత ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయనను ‘అయ్యా..

ఒక్క కాగితం నలగకుండా నేను పుస్తకం చదువుకుంటాను. దయచేసి నాకు పుస్తకం ఇప్పించండి’ అని ప్రార్థించి పుస్తకాన్ని తెచ్చుకుని చదువుకునేవారు. పుస్తకా లు ఉన్న వ్యక్తులు తనను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్లి, వాటిని తెచ్చుకుని చదివి గొప్ప తత్వవేత్త అయ్యారు. 21 ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్‌గా చేరిన రాధా కృష్ణన్ ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాల యం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ విధు లు నిర్వర్తించారు.

నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయవృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించటం వల్ల, తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన. ఆధునిక కాలంలో విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా ఆచార్య రాధాకృష్ణన్ జీవితం అనేక పాఠాలను నేర్పుతుంది. ఆచార్యుడిగా, ఉపకులపతిగా, దౌత్యవేత్తగా, స్వాతంత్య్ర భారతావని తొలి ఉపరాష్ర్టపతిగా, రెండో రాష్ర్టపతిగా ఆయన అధిరోహించిన శిఖరాలు.. ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను తెలియజేస్తున్నాయి.

అందరికి సమాన హక్కులు..

సర్వేపల్లి రాధాకృష్ణన్ తన బయోగ్రఫీలో శూద్ర, అతి శూద్రులకు విద్యను నిరాకరించడం వేదా ల్లోని పురుష సూక్తలో పేర్కొనడం గొప్పదిగా అభివర్ణించొచ్చు. తన లో ఉన్న అప్రజాస్వామ్య, అసమానత్వ లక్షణానికి నిదర్శనంగా చెప్పు కోవాల్సిందే. కానీ సమాజం నుం చి ఏమి ఆశించకుండా సంఘం కోసమే తమ జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులని నేటి కేంద్ర ప్రభుత్వాలు వారి జన్మదినానికి ఎలాం టి ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయం.

భారతీయ వ్యవస్థలో సామాజిక రాజకీయ సాంస్కృతిక పరివర్తన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఫూలే దంపతుల్లో.. సావిత్రిబాయి పూలే జన్మదినమైన జనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపితే బాగుంటుంది. భారతీయ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఉపాధ్యాయ దినోత్సవం పేరుతో గుర్తుచేసుకొని సామాజిక గౌరవం ఇస్తున్న వేళ..

అణగారిన వర్గాల కు చెందిన పూలే దంపతులకు నేటి కేంద్ర ప్రభుత్వాలు తగిన గౌరవం ఇవ్వడం లేదని పీడిత కులాల మేధావులు, ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్న అంశం. తన భర్త మహా త్మా జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చదువుకొని సంఘ పరివర్తన కోసం, సమ సమా జ స్థాపన కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలేని చదువుల తల్లిగా గుర్తించి ఆమె జన్మదిన ఉత్స వాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని సమకాలీన మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.

కాబట్టి నేటి కేంద్ర ప్రభుత్వం మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజం లో మెజార్టీ ప్రజల ఆలోచనలకు అనుకూలంగా, సామాజిక ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టడం నేటి ప్రభుత్వాలపై ఉన్న బాధ్యత. 

నిజమైన విద్య అంటే?

అంతిమంగా విద్య అంటే గురువు సహకారంతో సత్యాన్ని సత్యంగా.. అసత్యన్ని అస త్యముగా గ్రహించడమే నిజమైన విద్య అని గౌతమ బుద్ధుడు రుజువు చేశాడు. కాబట్టి నేటి ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తమకు ప్రభుత్వాల నుంచి రావలసిన సౌకర్యాలు, ఆర్థిక అంశాల కోసం ఏ విధంగా అయితే పోరా టం చేస్తారో, అంతే స్థాయిలో విద్యార్థులకి కావాల్సిన మౌలిక సౌకర్యల కోసం, విద్యార్థుల సమస్యలు స్వల్ప వ్యవధిలో పరిష్కార మయ్యేలా ప్రభుత్వాలను తగిన విధంగా సామాజిక పరివర్తన కోసం పనిచేసేలాగా నేటి ఉపాధ్యాయ లోకం కృషి చేయాలి.

అంతే కాకుండా మూఢత్వంతో, సామాజిక అంధత్వంతో ఏ విషయాన్ని కూడా విద్యార్థులు నమ్మి చదువుకొని అజ్ఞానంలో ఉండ కుండా, విచక్షణ జ్ఞానంతో, మనోనేత్రంతో ప్రతి అంశంలో సత్యాన్ని మాత్రమే విద్యార్థులు చూడగలిగే శక్తిని ఉపాధ్యాయులు బోధించాలి. అంతే స్థాయిలో గురుశిష్యుల మధ్య సామాజిక గౌరవం, భక్తి శ్రద్ధలు ఉండేలా విద్యార్థులకు తల్లిదండ్రులు నేర్పించాలి.

అదీగాక గురువుతో ఏ విధంగా నడుచుకోవాలి, తమకు కావలసిన జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలనే తత్వాన్ని అలవరచుకోవాలి. గురు శిష్యుల బంధం ఆరోగ్యవం తంగా ఉండేలా తమ పిల్లలకి ఆయా మానవత్వ, నైతిక విలువలు తల్లిదండ్రులు పెంపొందించాలి. అదే నేటి తల్లిదండ్రులపై ఉన్న సామాజిక కర్తవ్యం.. సామాజిక బాధ్యత అని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరముందనేది చారిత్రక సత్యం.