9 July, 2026 | 6:48 PM

ఎండ్లబండిపై టీచర్ల ‘బడిబాట’

11-06-2024 12:10 AM

నిర్మల్ జిల్లాలో వినూత్న ప్రచారం

నిర్మల్, జూన్10 (విజయక్రాంతి) :  జిల్లా కుంటాల మండలం పెంచికల్ పహాడ్ గ్రామంలో సోమవారం బడిబాటను వినూత్నంగా చేపట్టారు. ఎండ్లబండిపై ప్రచారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎల్లన్న ఆధ్వర్యంలో ఎడ్లబండిపై ఊరేగింపుగా వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని గ్రామస్థులకు పిలుపునిచ్చారు. బడీడు పిల్లలను పనులకు తీసుకెళ్లకూడదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఉన్నాయని, డీజీ క్లాసుల నిర్వహణకు కూడా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, సర్కారు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, బడిబాట ద్వారా ఇప్పటివరకు 20 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినట్లు పేర్కొన్నారు.