2 September, 2026 | 2:08 AM

ప్రణయ్‌కుమార్‌కు జాతీయ పురస్కారం

11-06-2024 | 12:10am

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్10 (విజయక్రాంతి): బీసీ యువజన సంఘం కుమ్రంభీం జిల్లా అధ్యక్షుడు అవిడపు ప్రణయ్‌కుమార్ బహుజన సాహిత్య అకాడమీ అందించే మహాత్మాజ్యోతిబా ఫూలే జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. మహారాష్ట్రపుణెలోని నెహ్రూ సాంస్కృతిక భవన్‌లో సోమవారం జరిగిన బహుజన సాహిత్య ఆకాడమీ పశ్చిమ భారత్ బహుజన రైటర్స్ కాన్ఫరెన్స్‌లో అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రణయ్‌కుమార్ పురస్కారాన్ని అందుకున్నారు.