calender_icon.png 5 September, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రివేణి జూనియర్ కళాశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

05-09-2025 07:52:59 PM

భద్రాచలం (విజయక్రాంతి): సెప్టెంబర్ 5న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం చర్ల రోడ్‌లో గల త్రివేణి జూనియర్ కళాశాల(Triveni Junior College)లో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీమతి కోడూరి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఎదుగుదలకు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని, మా కళాశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంలో సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించారు. కళాశాల డైరెక్టర్ శ్రీమతి కోడూరి ప్రశాంతి , చైర్మన్  కోడూరి సత్యనారాయణ , ప్రిన్సిపాల్  శ్రీకాంత్ గారు, బోధనా సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.