05-09-2025 10:05:03 PM
కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...కేసుల రాజీకి లోక్ అదాలత్ మంచి సువర్ణ పరిష్కారానికి వేదిక. ఈనెల తేదీ 13న ఫస్ట్ క్లాస్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ నారాయణ్ ఖేడ్ కోర్టు నందు లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పలు రకాల కేసులను పరిష్కరించుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు వివిధ ఘర్షణలో కేసులు నమోదు చేసుకున్నటువంటి, ఇంతవరకు పరిష్కారం కానీ, ఇతర కేసులను సైతం రాజి చేసుకునేందుకు ఇదో మంచి సువర్ణ అకాశమని రాజీ మార్గమే... రాజ మార్గం అని అన్నారు. ఎవరు ప్రతీకారాలకు పోకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. స్నేహభావంతో మెలగడానికి ఈ అదాలత్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ లోక్ అదాలత్ లో రాజి చేసుకొని కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉందని కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.