calender_icon.png 6 September, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయులు

05-09-2025 09:55:42 PM

ఉత్తమ గురువులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయం

మణుగూరు,(విజయక్రాంతి): విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  కొనియాడారు. ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా  శుక్రవారం విద్యాశాఖ, వాసవీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జడ్పీ కో-ఎడ్యుకేషన్  పాఠశాలలో  జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ... దేశంలో ఎంతోమంది ఉపాధ్యాయులు అనేక గొప్ప పదవులను అధి రోహించిన వారున్నారని, అందులో సర్వేపల్లి రాధాకృష్ణ ముఖ్యులని తెలిపారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.