05-09-2025 10:00:25 PM
వడ్డేపల్లి,(విజయక్రాంతి): శంకుస్థాపన చేసిన నిర్ణీత కాలవ్యవధిలోనే ప్రారంభోత్సవం కూడా చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని వరంగల్ పశ్చిమ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వారు కాజీపేటలోని అంబేద్కర్ కాలనీలో సుమారు 90 లక్షలతో 61వ, 62వ, 63వ డివిజన్లకు సంబంధించిన అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన 21 నెలల కాలంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వర్షాకాలంలో చాలా ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం నుంచి కాపాడుకోగలిగామన్నారు.
నియోజవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డికి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు సహకారం అందిస్తున్న ప్రజలకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నగరంలో ప్రధాన కాలనీలను అత్యవసర రోడ్లను నిర్మాణం చేపట్టుకొని గత పాలకుల ప్రభుత్వాల చేతుల్లో అభివృద్ధికి నోచుకుని చాలా కాలనీలను కూడా అభివృద్ధి చేసుకున్నమని తెలిపారు. అంతకు ముందు అంబేద్కర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.