05-09-2025 10:25:46 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాసిపేట మండలంలోని ముత్యంపల్లి మోడల్ స్కూల్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేసి చిన్నారిని తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారి చొప్పరి అక్షిత మోడల్ స్కూల్ ఆవరణలో తల్లితో కలిసి ఉన్న సమయంలో కుక్కల మంద దాడి చేశాయి. తల, శరీరంపై కుక్కల మంద తీవ్రంగా గాయపరచడంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తల భాగంలో తీవ్రంగా కలవడంతో చిన్నారికి వైద్యం చేయాలని వైద్యులు సూచించారు