18 April, 2026 | 1:07 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ఉపాధ్యాయులు పోక్సోచట్టం, సైబర్‌నేరాలు పట్ల అప్రమత్తతో ఉండాలి

17-05-2025 12:00 AM

డీఎస్పీ అబ్దుల్ రెహమాన్

కొత్తగూడెం మే 16 (విజయ క్రాంతి) : ఉపాధ్యాయులు పోక్స్కో, సైబర్ నేరాలపట్ల అవగాహన కలిగి ఉండాలని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ అన్నారు.శుక్రవారం జిల్లా విద్యా శిక్షణా కేంద్రం కొత్తగూడెం లో జరుగుతున్న  ఆంగ్ల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టం, బాలికల అక్రమ రవాణా , సైబర్ నేరాలపై ఉపాధ్యాయులందరికీ  ఆయన అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం నేరం చేయడమే కాకుండా, నేరాన్ని దాచిపెట్టడం కూడా నేరంగా పరిగణించబడుతుందన్నా రు.

విద్యార్థులు పాఠశాలకు వచ్చిన దగ్గర నుండి పాఠశాల నుండి వెళ్లే వరకు కూడా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని, తెలియని కాల్స్ కు సమాధానం ఇవ్వడం వల్ల మన అకౌంట్ హ్యాక్ అయి అందులో ఉన్న సొమ్ము మొత్తం చోరీకి గురవుతుందని , అందుకే అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ సమాధానం ఇవ్వవద్దన్నారు.

ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, 1 టౌన్ సిఐ కరుణాకర్ , ఎస్‌ఐ విజయ,  రిసోర్స్ పర్సన్లు సైదులు, మీరా హుస్సేన్, మురళి హరిబాబు లు పాల్గొన్నారు.